Share News

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:55 PM

రైలుపట్టాలపై బుధవారం వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

కొత్తూర్‌, ఆగస్టు 21: కొత్తూర్‌ సమీపంలో గల వినాయక స్టీల్‌ ఫ్యాక్టరీ వెనుక రైలుపట్టాలపై బుధవారం వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 40ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ఆయన అన్నారు. మృతదేహాన్ని షాద్‌నగర్‌ అసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తిమ్మాపూర్‌ రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ రహెమత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:55 PM