మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతికి పెద్దపీట
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:20 AM
ముస్లిం మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు.
మహేశ్వరం, మార్చి 3 : ముస్లిం మైనారిటీ విద్యార్థుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నాగారంలోని మదర్సాలో జరిగిన నూర్‌ఉల్ ఉలోం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మదర్సా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మదర్సా ఇన్‌చార్జి మహ్మద్ గౌస్, ఉస్మాన్‌ఖాన్, బిస్మిల్లా, హజీఖాన్, ఆ జం, మర్యాద రాఘవేందర్‌రెడ్డి, లింగం, పాండుయాదవ్, నయూం తదితరులు పాల్గొన్నారు.