వైభవంగా కల్పవృక్ష వాహన సేవ
ABN , Publish Date - Apr 07 , 2024 | 11:59 PM
కొడంగల్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ 44వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఆలయ మాడ వీధుల్లో స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు.
కొడంగల్, ఏప్రిల్ 7 : కొడంగల్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ 44వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఆలయ మాడ వీధుల్లో స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాస్, టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వేంకటేశ్వర స్వామివారికి శేషవస్త్రాలు సమర్పించారు.