తాళం వేసిన ఇంటికి కన్నం
ABN , Publish Date - May 17 , 2024 | 12:36 AM
తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేసి రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు దొంగిలించిన ఘటన కందుకూరు పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రెండున్నర తులాల బంగారం.. రూ.50వేల అపహరణ
కందుకూరు, మే 16 : తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేసి రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు దొంగిలించిన ఘటన కందుకూరు పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నేదునూరు గ్రామానికి చెందిన కొమ్ము జంగయ్య కుటుంబ సభ్యులతో బుధవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి స్లాబ్‌పై నిద్రించారు. గురువారం తెల్లవారుజామున జంగయ్య భార్య నవనీత ఉదయం చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో వస్తువులు, బట్టలు చిందరవందరగా ఉన్నాయి. కందుకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును దొంగించినట్లు ఫిర్యాదు చేసిన ట్లు సీఐ మక్భూల్‌జానీ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.