స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:54 PM
స్థానిక ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేస్తూ సత్తాచాటి బీజేపీ జెండాను ఎగురవేద్దామని బీజేవైఎం స్వచ్ఛభారత్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రాము అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చర్లగూడలో 204, రుద్రారం బూత్‌లో 234 బూత్ కమిటీలు వేశారు. చర్లగూడ బూత్ కమిటీ అధ్యక్షుడిగా ముత్యంరెడ్డి, రుద్రారంనకు రాఘవేందర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
షాబాద్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేస్తూ సత్తాచాటి బీజేపీ జెండాను ఎగురవేద్దామని బీజేవైఎం స్వచ్ఛభారత్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రాము అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చర్లగూడలో 204, రుద్రారం బూత్‌లో 234 బూత్ కమిటీలు వేశారు. చర్లగూడ బూత్ కమిటీ అధ్యక్షుడిగా ముత్యంరెడ్డి, రుద్రారంనకు రాఘవేందర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి చేరేవిధంగా చూడాలన్నారు. నాయకులు విజయ్‌కుమార్, శివకుమార్, సాయికుమార్, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీనివాస్, సందీప్, అరుణ్, వెంకటయ్య, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.