Share News

మలేరియాను నిర్మూలిద్దాం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:46 PM

మలేరియాను పూర్తిగా నిర్మూలిద్దామని, అందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.వెంకటేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినం సందర్భంగా గురువారం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రి నుంచి పట్టణ ప్రధాన కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రాకే్‌షతో కలిసి వెంకటేశ్వర్‌రావు ప్రారంభించారు.

మలేరియాను నిర్మూలిద్దాం
ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు

డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు

షాద్‌నగర్‌, ఏప్రిల్‌ 25 : మలేరియాను పూర్తిగా నిర్మూలిద్దామని, అందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.వెంకటేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినం సందర్భంగా గురువారం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రి నుంచి పట్టణ ప్రధాన కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రాకే్‌షతో కలిసి వెంకటేశ్వర్‌రావు ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వైద్య సిబ్బందితో ఆయన మాట్లాడారు. మలేరియా వ్యాధికి ప్రధాన కారణమైన దోమలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, వ్యాధికి సోకిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దోమల సంచారం ఎక్కువగా ఉంటుందని, వాటిని పూర్తిగా నివారించేందుకు వైద్యసిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:47 PM