సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:50 PM
ప్రతీ ఏడాది మాదిరిగానే యాదవ్‌లు నిర్వహించే సదర్ ఉత్సవాలను విజయవంతం చేయాలని యాదవ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
షాద్‌నగర్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రతీ ఏడాది మాదిరిగానే యాదవ్‌లు నిర్వహించే సదర్ ఉత్సవాలను విజయవంతం చేయాలని యాదవ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని ఓ హోటల్లో ఉత్సవ కమిటీ నాయకులు సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదయ్యయాదవ్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా సదర్ ఉత్సవాలను నిర్వహించి యాదవుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల యాదవ సంఘం నాయకులు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించి 24న పట్టణంలోని మల్లికార్జున మినీఫంక్షన్‌హాల్లో తుది సమావేశం ఏర్పాట్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గున్న బీమయ్య యాదవ్, బక్కన్న యాదవ్, గడ్డం శ్రీనివా్‌సయాదవ్, రఘునాథ్ యాదవ్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.