లంగాడి క్రీడను ప్రోత్సహించాలి
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:10 AM
లంగాడి క్రీడను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని లంగాడి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సురేశ్‌గాంధీ, తెలంగాణ లంగాడి సంఽఘం ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్ కోరారు.
శంషాబాద్ రూరల్, జూలై 17: లంగాడి క్రీడను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని లంగాడి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సురేశ్‌గాంధీ, తెలంగాణ లంగాడి సంఽఘం ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్ కోరారు. ఈమేరకు బుధవారం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లోని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ రాష్ట్ర మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేను వారు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. లంగాడి క్రీడను అన్నిరంగాల్లో ప్రోత్సహించాలని కోరడంతో పాటు ఎస్‌జీఎ్‌ఫఐ, స్పోర్ట్స్ మినిస్ర్టీ అసోసియేషన్ గురించి మంత్రితో చర్చించినట్లు వారు తెలిపారు. ఇందుకు స్పందించిన ఆమె ఎస్‌జీఎ్‌ఫఐకి అనుబంధంగా ఉన్న రాష్ట్రాల వివరాలతో ఢిల్లీకి రావాలని ఆమె తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంగాడి జయవంత్ పాల్గొన్నారు.