Share News

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిపై భూ కబ్జా కేసు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:16 AM

భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిపై రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. తన 200 గజాల ప్లాటు కబ్జా చేశారంటూ నల్గొండకు చెందిన కంచర్ల రాధిక అనే మహిళ ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్‌లపై 447, 427, 506, ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్‌ ప్రకారం ఈనెల 13న ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 207/2024 కింద కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిపై భూ కబ్జా కేసు

ఆదిభట్ల, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి) : భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిపై రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. తన 200 గజాల ప్లాటు కబ్జా చేశారంటూ నల్గొండకు చెందిన కంచర్ల రాధిక అనే మహిళ ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్‌లపై 447, 427, 506, ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్‌ ప్రకారం ఈనెల 13న ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 207/2024 కింద కేసు నమోదు చేశారు. చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, మారుతి రవి శంకర్‌లు 2003లో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం రాగన్నగూడ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 500, 501లో 1200 గజాల స్థలం ఖరీదు చేసి చుట్టూ కాంపౌండ్‌వాల్‌, లోపల ఇంటి నిర్మాణం చేపట్టారని.. అందుకు సంబంధించి మున్సిపల్‌ పర్మిషన్లు, ప్రాపర్టీ ట్యాక్స్‌, కరెంట్‌ బిల్లులు, ప్లాటుకు సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్స్‌ పోలీసులకు సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కిరణ్‌ కుమార్‌రెడ్డి 2003లో ప్లాటు కొనుగోలు చేశారు. రాధిక అదే సర్వేనెంబర్‌లో 2015లో 200 గజాల ప్లాటు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆమెకు చెందిన 200 గజాల ప్లాటుతో పాటు వెంచర్‌లో చూపిన రోడ్డును సైతం కిరణకుమార్‌రెడ్డి, మారుతి రవిశంకర్‌లు కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

కేసు దర్యాప్తులో ఉంది.. ఎవరిపైనా నేరారోపణ లేదు : సీఐ

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం రాగన్నగూడ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్‌ 500, 501లో మారుతి నగర్‌ వెంచర్‌లో రెండు వందల గజాల ప్లాట్‌ కబ్జాకు గురైనట్లు రాధిక అనే మహిళ ఇబ్రహీంపట్నం మెట్రో పాలిటన్‌ కోర్టును ఆశ్రహించింది. ఈమేరకు 15వ మెట్రోపాలిటన్‌ కోర్టు ఆదేశాల మేరకు చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, రవిశంకర్‌లపై కేసు నమోదు చేశాం. కేసు దర్యాప్తులో ఉంది. కబ్జా అయినట్లు చెబుతున్న స్థలంలో ప్రహరీ నిర్మాణం చేపట్టారని, అందులో ఇంటి నిర్మాణం చేపట్టి కొందరు నివాసముంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే, ఆ సర్వేనెంబర్‌లో డబుల్‌ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు సమాచారం. సబ్‌ రిజిస్ర్టార్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వివరాలను కోర్టుకు సమర్పిస్తాం. ఇప్పటి వరకు ఎవరిపైనా నేరారోపణ చేయడం లేదు. ఉన్నతాధికారులు కూడా విచారణ చేపట్టారు. కాగా, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూధన్‌ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి 2003లో 1200 గజాల స్థలం చట్టప్రకారమే కొనుగోలు చేశారని అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:16 AM