కేటీఆర్ మాటలు హస్యాస్పదం : బక్కని
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:22 AM
పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం హస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఎద్దేవా చేశారు.
షాద్‌నగర్ రూరల్, జూలై 2: పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం హస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఎద్దేవా చేశారు. ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడలో మంగళవారం టీడీపీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నపు నిజాయితీ ఎక్కడికి పోయిందన్నారు. టీడీపీ ఇతర పార్టీలు విలీనమయ్యాయని కేటీఆర్ అంటున్నారని, ఆనాడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరిలు విలీనం చేయడానికి పార్టీ అధ్యక్షులా? అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి గెలిచిన సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకున్నారా? అని అన్నారు. స్వార్థబుద్ధితో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందిన వారు రాజనీతి గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. రాజకీయ నాయకులు హూందాగా మాట్లాడే సాంప్రదాయాన్ని నాశనం చేసింది మీరేనన్నారు. పార్టీలు మారడం వల్ల రాజకీయాల మీద గౌరవం తగ్గిందని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం ఎంలో కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి గందం ఆనంద్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.