Share News

కృష్ణన్నా .. పంచకట్టు బాగుంది!

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:19 AM

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితాహరినాథ్‌రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛంతో అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

కృష్ణన్నా .. పంచకట్టు బాగుంది!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి

మహేశ్వరం వాసులు ఏమంటున్నరు?

పార్టీ బలోపేతానికి మీ సహకారం కావాలి

తీగల కృష్ణారెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి మాటామంతీ

మహేశ్వరం, ఫిబ్రవరి 26 : మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితాహరినాథ్‌రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛంతో అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తీగలతో సీఎం మాట్లాడుతూ.. ‘కృష్ణన్నా నీ పంచకట్టు బాగుంది. మహేశ్వరం ప్రజలు ఏమంటున్నరు? నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మీ సహకారం కావాలి.’ అని నవ్వుతూ పలకరించారు. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పాటు పడుతామన్నారు. అందుకు ఎల్లవేళలా కాంగ్రెస్‌ అధినాయకత్వం అండదండలతో పాటు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారని తీగల కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - Feb 27 , 2024 | 12:19 AM