బాలిక కిడ్నాప్‌నకు యత్నం.. నిందితుడికి దేహశుద్ధి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:51 PM
ఆరేళ్ల బాలిక కిడ్నా్‌పనకు యత్నించిన వ్యక్తిని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

పోలీసులకు అప్పగింత
బొంరా్‌సపేట్, జూన్ 7: ఆరేళ్ల బాలిక కిడ్నా్‌పనకు యత్నించిన వ్యక్తిని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బొంరా్‌సపేట్ మండలంలోని రేగడిమైలారం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ ఆరేళ్ల బాలిక గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. అదే గ్రామానికి చెందిన కడంపల్లి అంజిలయ్య బాలికను గ్రామ శివారులోని పొదల్లోకి తీసుకెళ్లాడు. బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు, గ్రామస్థులు వెతుకుతుండగా గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో కడంపల్లి అంజిలయ్య దగ్గర ఉండటంతో గమనించిన గ్రామస్థులు పట్టుకున్నారు. అంజిలయ్యను ఆరా తీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై బొంరా్‌సపేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.