Share News

కల్యాణం.. కమనీయం

ABN , Publish Date - May 23 , 2024 | 11:42 PM

మండల పరిధిలోని ఉట్లపల్లి దేవునిగుట్టపై వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు తేరటి లక్ష్మణ్‌ముదిరాజ్‌ ఆధ్వర్యంలో వేద పండితులు రేవెళ్ల రాజు శర్మ ఉదయం సర్వదేవతల అభిషేకాలు, సుదర్శన హోమం, శ్రీరుద్రహోమం, ఆంజనేయ హోమాలను నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీలక్ష్మీచెన్నకేశస్వామి తిరుకల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

కల్యాణం.. కమనీయం
స్వామివారి విగ్రహమూర్తులను తరలిస్తున్న భక్తులు

వైభవంగా చెన్నకేశవస్వామి పరిణయ వేడుక

ఉట్లపల్లి దేవునిగుట్టకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తజనం.. హాజరైన ప్రముఖులు

కందుకూరు, మే 23 : మండల పరిధిలోని ఉట్లపల్లి దేవునిగుట్టపై వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు తేరటి లక్ష్మణ్‌ముదిరాజ్‌ ఆధ్వర్యంలో వేద పండితులు రేవెళ్ల రాజు శర్మ ఉదయం సర్వదేవతల అభిషేకాలు, సుదర్శన హోమం, శ్రీరుద్రహోమం, ఆంజనేయ హోమాలను నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీలక్ష్మీచెన్నకేశస్వామి తిరుకల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మండంలోని దాసర్లపల్లి, సాయిరెడ్డిగూడ, కందుకూరు, కొత్తగూడ, దెబ్బడగూడ, గ్రామాల భక్తులతో పాటు కడ్తాల్‌ మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు షామియానాలు ఏర్పాటు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కాగా, స్వామివారి కల్యాణానికి చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్‌ ఎల్మటి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, బీజేపీ పంచాయతీసెల్‌ రంగారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్‌ సాధ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌ ఇ.రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీ బి.మల్లేష్‌, నాయకులు జిట్ట రాజేందర్‌రెడ్డి, నిమ్మ అంజిరెడ్డి, ఊటు మహేందర్‌, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:42 PM