Share News

కమలం గూటికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే!

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:14 AM

Kalvakurthi former MLA of Kamalam Gutiki!Kalvakurthi former MLA of Kamalam Gutiki!

కమలం గూటికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే!

బీఆర్‌ఎస్‌ను వీడనున్న జైపాల్‌ యాదవ్‌

జైపాల్‌తో బీజేపీ నేతల సంప్రదింపులు

ఆమనగల్లు, మార్చి 15(ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ కారు దిగనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని జైపాల్‌ యాదవ్‌ వీడుతున్నట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి మూడో స్థానంలో నిలిచిన జైపాల్‌.. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, బీఆర్‌ఎస్‌ క్రమంగా బలహీన పడుతుండటంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దానికితోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, పలువురు బీజేపీ అగ్రనేతలు జైపాల్‌ను పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గ నేత ఆచారి కూడా జైపాల్‌ పార్టీలోకి రావడంపై అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిసింది. నేడు నాగర్‌కర్నూల్‌లో జరిగే ప్రధాని సభలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ విషయమై జైపాల్‌ ను వివరణ కోరగా.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, అనుచరులు, పార్టీ నేతలతో సమాలోచనలు జరిపి నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:14 AM