యువకుడి వద్ద గంజాయి పట్టివేత
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:38 AM
ఆమనగల్లు పట్టణంలోని బస్టాండ్ కూడలిలో మంగళవారం రాత్రి గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ యువకుడు బైక్‌పై కల్వకుర్తి వైపు వెళ్తున్నాడు.

ఆమనగల్లు, మార్చి 5 : ఆమనగల్లు పట్టణంలోని బస్టాండ్ కూడలిలో మంగళవారం రాత్రి గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ యువకుడు బైక్‌పై కల్వకుర్తి వైపు వెళ్తున్నాడు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అతడి వద్ద గంజాయి లభ్యమైనట్టు తెలిసింది. గంజా యితో పాటు ఇతర మాదక ద్రవ్యం కూడా పట్టుబడినట్టు సమాచారం. కాగా పట్టుబడిన గంజాయి ఎంత అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.