Share News

సీఎం సమక్షంలో కాంగ్రె్‌సలో చేరిక

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:09 AM

నాగారం మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు శనివారం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

సీఎం సమక్షంలో కాంగ్రె్‌సలో చేరిక
మాజీ ఎంపీపీ స్వప్న, ఆమె భర్త, కౌన్సిలర్‌ వెంకట్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

కీసర రూరల్‌, ఏప్రిల్‌ 13: నాగారం మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు శనివారం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో నాగారం మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మల్లే్‌షయాదవ్‌, మాజీ జడీపటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ స్వప్న, కౌన్సిలర్లు మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుర్వి శ్రీనివాస్‌, అన్నంరాజ్‌ సుమిత్ర, కో-ఆప్షన్‌సభ్యుడు ఆదం షఫీ, సింగిల్‌విండో డైరెక్టర్‌ భూపాల్‌రెడ్డి, దమ్మాయిగూడ మాజీ సర్పంచ్‌, ప్రస్తుత కౌన్సిలర్‌ పాండాల అనురాధ యాదగిరిగౌడ్‌ దంపతులు పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు. వీరంతా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే కావటంతో ఆ పార్టీకి భారీ గండి పడింది. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మరింత మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి ఇటీవలే బీజేపీలో చేరగా, పాలకవర్గానికి చెందిన వారు ఇతర పార్టీల్లో చేరుతుండటంతో నాగారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ బలహీనంగా మారుతోంది. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివా్‌సరెడ్డి, కౌన్సిలర్‌ పంగ హరిబాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నల్లోల్ల కుమార్‌, నాయకులు పొట్ట శ్రీశైలం, సతీష్‌ గౌడ్‌, కొండల్‌రెడ్డి, సత్యంసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:09 AM