బెల్లం పానకం ధ్వంసం.. నాటుసారా స్వాధీనం
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:35 AM
ఆమనగల్లు ఎక్సైజ్ పరిధిలోని కడ్తాల, మాడ్గు ల, ఆమనగల్లు మండలాల పరిధిలో ఆదివారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 250 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.

ఆమనగల్లు, జూన్ 16: ఆమనగల్లు ఎక్సైజ్ పరిధిలోని కడ్తాల, మాడ్గు ల, ఆమనగల్లు మండలాల పరిధిలో ఆదివారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 250 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. పల్లెచెల్కతండాలో సబావత్ లస్కర్ వద్ద రెండు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. నాగిళ్ల, ముద్విన్, ఎక్వాయ్‌పల్లి గ్రామాల్లో దాడులు చేశారు. ఎక్సైజ్ సీఐ బద్యాచౌహన్ మాట్లాడుతూ తెలంగాణను నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్రమంగా నాటుసారా క్రయవిక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాటుసారా క్రయ విక్రయాలపై తమకు సమాచారమందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆయన వెంట ఎక్సైజ్ ఎస్సైలు స్వప్న, శంకర్, సిబ్బంది ఉన్నారు.