Share News

కల్వకుర్తిలోని ప్రతి ఎకరాకు సాగునీరు

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:56 PM

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి, రైతుల కలలు సాకారం చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.

కల్వకుర్తిలోని ప్రతి ఎకరాకు సాగునీరు
పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి, తదితరులు

కడ్తాల్‌, జనవరి 29 : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి, రైతుల కలలు సాకారం చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి పథకాలను పూర్తిచేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. మండలంలోని అన్మా్‌సపల్లి గ్రామంలో రూ.20 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, సర్పంచ్‌ పోతుగంటి శంకర్‌, ఎంపీటీసీ గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. అన్మా్‌సపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. పంచాయతీకి ప్రహరి గోడ నిర్మాణానికి ఎస్డీఎఫ్‌ నుంచి రూ.15 లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలలో కల్వకుర్తి నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యం, వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. గ్రామాలలో గతంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబందించి సర్పంచ్‌ లకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని సర్పంచ్‌లు ఆందోళన చెందవద్దని చెప్పారు. మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ సర్పంచ్‌ వేణుగోపాల్‌, ఉప సర్పంచ్‌ అనిల్‌, ఎంపీటీసీ పాలకుర్ల రాములు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీచ్యనాయక్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యనాయక్‌, ఏఈ పరమేశ్‌, పంచాయతీ కార్యదర్శి హరీశ్‌ రెడ్డి, నాయకులు గూడూరు భాస్కర్‌ రెడ్డి, హన్మనాయక్‌, ముత్తి కృష్ణ, చేగూరి వెంకటే శ్‌, సుధీర్‌ రెడ్డి, పాపిరెడ్డి, చందోజీ, బిక్షపతి, యాదగిరి రెడ్డి, నరేశ్‌ నాయక్‌, మోత్యనాయక్‌, శేఖర్‌గౌడ్‌, సుమన్‌, లాయక్‌అలీ, జహంగీర్‌అలీ, ఇమ్రాన్‌బాబా, రామకృష్ణ, జగన్‌,శ్రీను, కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:56 PM