Share News

చేవెళ్ల అభివృద్ధి కోసమే రాజకీయల్లోకి

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:23 AM

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయల్లోకి వచ్చానని, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాను ప్రజల మధ్యే ఉంటానని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

చేవెళ్ల అభివృద్ధి కోసమే రాజకీయల్లోకి
సమావేశంలో మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల, మార్చి 17 : చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయల్లోకి వచ్చానని, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాను ప్రజల మధ్యే ఉంటానని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల విసృతస్థాయి సమావేశాన్ని చేవెళ్ల పట్టణ కేంద్రంలోని సీహెచ్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కెఎస్‌. రత్నం, పలువురు సీనియర్‌ నేతలతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో మరోసారి ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. చేవెళ్ల పరిధిలో ఉన్న భూ కబ్జాదారులు, అవినీతిపరులు ఒక్కటై పోటీకి వచ్చినా ఓటర్లు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు.అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ రత్నం మాట్లాడుతూ చేవెళ్ల ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లు అడగడానికి వస్తున్నారని విమర్శించారు. వారికి ఓట్లు వేయొవద్దని ప్రజలకు సూచించారు. విశ్వేశ్వర్‌రెడ్డి ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు అంజన్‌కుమార్‌గౌడ్‌, కంజర్ల ప్రకాశ్‌, మల్లారెడ్డి, ప్రతా్‌పరెడ్డి, నర్సింహరెడ్డి, జిల్లా నాయకులు రమణారెడ్డి, తొండ రవి, కుంచం శ్రీనివా్‌సగుప్తా, నాగర్జున్‌రెడ్డి, జంగం శివానందం, మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. కాగా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. శంకర్‌పల్లి మండల అధ్యక్షుడు రాములుగౌడ్‌, మాజీ ఎంపీపీ. బీర్ల నర్సింలు, నాయకులు ఉన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:23 AM