Share News

క్వారీలో ఇంటర్‌ విద్యార్థి గల్లంతు

ABN , Publish Date - May 12 , 2024 | 12:15 AM

కంకరాళ్ల తండాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి మూడవత్‌ నితిన్‌(18) క్వారీలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు.

క్వారీలో ఇంటర్‌ విద్యార్థి గల్లంతు
నితిన్‌(ఫైల్‌)

కేశంపేట, మే 11: కంకరాళ్ల తండాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి మూడవత్‌ నితిన్‌(18) క్వారీలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. రాజునాయక్‌-సుశీల దంపతుల కుమారుడు నితిన్‌ శనివారం మిత్రులతో కలిసి పుట్టోనిగూడ సమీపంలోని క్వారీలో ఈతకు వెళ్లాడు. నీటిలోకి దూకి నితిన్‌ పైకి రాలేదు. దీంతో మిత్రులు గ్రామస్తులకు సమాచారమిచ్చారు. తండా వాసులు క్వారీ వద్దకు వెళ్లి నితిన్‌ కోసం గాలించారు. సాయంత్రం 6 అయినా నితిన్‌ ఆచూకీ దొరకలేదు. క్వారీలో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహం లభ్యం కాలేదు. ఎన్డీఆర్‌ఎ్‌ఫతో గాలిస్తే ఆచూకీ దొరుకుతుందని అంటున్నారు. క్వారీ వద్ద నితిన్‌ కుటుంబీకుల రోదనలు మిన్నాంటాయి. మాజీ సర్పంచ్‌ జగన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ లింగం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

Updated Date - May 12 , 2024 | 12:15 AM