ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:42 PM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా నిరంతరం కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎన్. శంకర్ అన్నారు.

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్
వికారాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా నిరంతరం కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎన్. శంకర్ అన్నారు. గురువారం జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో కళాశాల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సబ్జెక్టులలో సిలబ్‌సను త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ఉదయం స్టడీ హౌర్స్ నిర్వహించాలన్నారు. చురుకైన విద్యార్థులను గుర్తించి ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలన్నారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభించినందున త్వరగా సిలబ్‌సను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతూ మొదటి సంవత్సరం బ్యాక్‌లాగ్ సబ్జెక్ట్‌లు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని అన్నారు. తరుచుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూల్ ప్రకారం తరుచుగా పరీక్షలు నిర్వహించాలన్నారు. అదే విధంగా ఈ విద్యా సంవత్సరం నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ నర్సింహారెడ్డి, రూపాలక్ష్మి, విజయ కుమార్, బుచ్చిరెడ్డి, సురేశ్వర స్వామి, కుమారస్వామి, స్వర్ణలత, వెంకటేశ్వర రావు, మాక్బుల్, సీనియర్ అసిస్టెంట్ వినోద్ , జూనియర్ అసిస్టెంట్ సలీమా బేగం, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.