ముమ్మరంగా వరి కోతలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:35 PM
వానాకాలం సాగు చేసిన వరి పంట చేతి కొచ్చింది. యాచారం మండలం చిన్నతూండ్ల గ్రామంలో వర్షం భయంతో రైతులు పంట కోత పనులు ముమ్మరం చేశారు.

యాచారం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : వానాకాలం సాగు చేసిన వరి పంట చేతి కొచ్చింది. యాచారం మండలం చిన్నతూండ్ల గ్రామంలో వర్షం భయంతో రైతులు పంట కోత పనులు ముమ్మరం చేశారు. కూలీలను నమ్ముకోకుండా హార్వెస్టర్ యంత్రాలను తెప్పించి వరి కోతలు ప్రారంభించారు. యంత్రాలకు గంటకు రూ.2,800 వెచ్చిస్తూ కోతలు చేపట్టి వెంటవెంటనే ధాన్యాన్ని చేల నుంచి తరలిస్తున్నారు. యాచారం మండలంలో 4,120 ఎకరాలలో వరి సాగు చేశారు.