Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

జీపీ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలి

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:15 AM

గ్రామంపచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని జీపీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

జీపీ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలి

కొత్తూర్‌, మార్చి 2: గ్రామంపచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని జీపీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ శనివారం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు ఎంపీడీవో కార్యాలయం సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా.. జీపీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా కార్మికులకు బీమాతో పాటు గుర్తింపుకార్డులు, కనీస వేతనాలు అందజేయాలన్నారు. ఏఐటీయూసీ నాయకుడు మామిడి శేఖర్‌రెడ్డి, నాయకులు మైసయ్య, రాములు, భిక్షపతి, సురేష్‌, సాయిలు, యాదగిరి తదితరులున్నారు.

Updated Date - Mar 03 , 2024 | 09:24 AM