Share News

పాఠశాలలో సోలార్‌ సిస్టం ఏర్పాటు

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:54 PM

మండలంలోని తమ్ములపల్లి ప్రాథమిక పాఠశాలకు సిరో ఫార్మసీ లిమిటెడ్‌ కంపెనీ రూ.5లక్షల 50వేలతో సోలార్‌ సిస్టం ఏర్పాటు చేశారు.

పాఠశాలలో సోలార్‌ సిస్టం ఏర్పాటు

మర్పల్లి, మార్చి 24: మండలంలోని తమ్ములపల్లి ప్రాథమిక పాఠశాలకు సిరో ఫార్మసీ లిమిటెడ్‌ కంపెనీ రూ.5లక్షల 50వేలతో సోలార్‌ సిస్టం ఏర్పాటు చేశారు. కొంతకాలంగా విద్యుత్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామానికి చెందిన పలువురు కంపెనీ దృష్టికి తీసుకెళ్లగా.. సోలార్‌ సిస్టం ఏర్పాటుచేసి విద్యుత్‌ సమస్యను పరిష్కరించారు. దాంతో కంపెనీ హెచ్‌ఆర్‌ స్రవంతి వేణుగౌడ్‌ను ఆదివారం గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సోలార్‌ సిస్టం ఏర్పాటు చేసినట్లు స్రవంతి తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 11:54 PM