అమానుషం!
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:50 PM
ఆడపిల్ల పుడితే భారమనుకున్నారో లేదా ఇంకేదైనా కారణమో.. శిశువు చెట్ల పొదల్లో పడేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన గంటల్లోనే గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును చెట్ల పొదల్లో పడేశారు.

చెట్లపొదల్లో శిశువు మృతదేహం లభ్యం
షాద్‌నగర్ రూరల్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఆడపిల్ల పుడితే భారమనుకున్నారో లేదా ఇంకేదైనా కారణమో.. శిశువు చెట్ల పొదల్లో పడేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన గంటల్లోనే గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును చెట్ల పొదల్లో పడేశారు. ఈ సంఘటన మంగళవారం షాద్‌నగర్ పట్టణం చటాన్‌పల్లి శివారులో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ కథనం మేరకు.. మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పుట్టిన గంటల వ్యవధిలోనే చెట్ల పొదల్లో పడేశారు. అయితే, శిశువు చనిపోయిన తర్వాత పడేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు. విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.