Share News

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:42 PM

మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ మర్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని వేదపురి, బాలాజీనగర్‌ కాలనీల్లో కౌన్సిలర్లు కుంట్ల మౌనిక ఉదయపాల్‌రెడ్డి,మర్రి అర్చన రాంరెడ్డిలతో కలిసి శనివారం రూ.22 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న చైర్మన్‌ మర్రి నిరంజన్‌ రెడ్డి

ఆదిభట్ల, జూన్‌ 8 : మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ మర్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని వేదపురి, బాలాజీనగర్‌ కాలనీల్లో కౌన్సిలర్లు కుంట్ల మౌనిక ఉదయపాల్‌రెడ్డి,మర్రి అర్చన రాంరెడ్డిలతో కలిసి శనివారం రూ.22 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. నిరంజన్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ వార్డులో సమస్యలు గుర్తించడం జరిగిందని, సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ లాంటి మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, మిగతా సమస్యలు దశలవారిగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. వైస్‌ చైర్మన్‌ యాదగిరి, ఏఈ వీరాంజనేయులు, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ జాన్సన్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, రామారావు, పాండు గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:42 PM