Share News

వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన కేసులో

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:01 AM

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి గురువారం తీర్పు వెలువరించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన గణేష్‌..

వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన కేసులో

నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష

యాచారం, ఫిబ్రవరి 29 : నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి గురువారం తీర్పు వెలువరించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన గణేష్‌.. 2019లో తన కారును నిర్లక్ష్యంగా నడిపి మండల పరిధిలోని గున్‌గల్‌ గేటు వద్ద బైక్‌ను బలంగా ఢీ కొట్టాడు. దాంతో బైక్‌ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు క్రైం నెంబర్‌ 131/2019 కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి ప్రమాద వివరాలను పరిశీలించి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు కోర్టు కానిస్టేబుల్‌ సతీష్‌, యాచారం సీఐ శంకర్‌కుమార్‌లు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 12:01 AM