Share News

అక్రమంగా తరలిస్తున్న ఆవు, లేగదూడలు స్వాధీనం

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:00 AM

అనుమతులు లేకుండా ట్రాలీ ఆటోలో తరలిస్తున్న ఓ ఆవు, రెండు లేగదూడలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై బాల్‌రామ్‌నాయక్‌ తెలిపిన వివరాల మేరకు..

అక్రమంగా తరలిస్తున్న ఆవు, లేగదూడలు స్వాధీనం

ఆమనగల్లు, ఫిబ్రవరి 11 : అనుమతులు లేకుండా ట్రాలీ ఆటోలో తరలిస్తున్న ఓ ఆవు, రెండు లేగదూడలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై బాల్‌రామ్‌నాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. ఆమనగల్లు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ఏఎ్‌సఐ యాదయ్య సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌ వైపు పరదా కప్పుకొని వెళ్తున్న ఆటో ట్రాలీని ఆపి తనిఖీలు చేశారు. అందులో అనుమతులు లేకుండా ఆవు, రెండు లేగదూడలను తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆవు, దూడలను, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ రవి, ఆటో యజమాని అబ్దుల్‌ మతిన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:00 AM