అక్రమంగా మట్టి తరలింపు.. 13 టిప్పర్ల సీజ్
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:04 AM
అక్రమంగా మట్టి తరలిస్తున్న 13 టిప్పర్లను ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం సీజ్ చేసి మైనింగ్ అధికారులకు అప్పగించారు.

ఇబ్రహీంపట్నం, జూన్ 11: అక్రమంగా మట్టి తరలిస్తున్న 13 టిప్పర్లను ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం సీజ్ చేసి మైనింగ్ అధికారులకు అప్పగించారు. ఎస్సై మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం మా డ్గుల మండలం ఇర్విన్ నుంచి అనుమతులు లేకుండా టిప్పర్లలో మట్టిని ఇబ్రహీంపట్నం పరిధి కొంగరకలాన్ దగ్గర ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఈక్రమంలో 13 టిప్పర్లను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై మైబెల్లి తెలిపారు.