Share News

అవకాశమిస్తే పాలమూరు గొంతుకనవుతా

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:17 AM

ప్రజలు ఎన్నికల్లో గెలిపించి ఎంపీగా అవకాశమిస్తే పాలమూరు గొంతుకనవుతానని మహబూబ్‌నగర్‌ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు.

అవకాశమిస్తే పాలమూరు గొంతుకనవుతా
షాద్‌నగర్‌ : మీడియాతో మాట్లాడుతున్న వంశీచంద్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి

షాద్‌నగర్‌, మార్చి 10 : ప్రజలు ఎన్నికల్లో గెలిపించి ఎంపీగా అవకాశమిస్తే పాలమూరు గొంతుకనవుతానని మహబూబ్‌నగర్‌ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తనకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధిష్టానానికి రుణపడి ఉంటానని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఎలా గెలిపించారో.. తనను కూడా పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. తాను గెలిస్తే పార్లమెంట్‌లో పాలమూరు ప్రజల గొంతును వినిపిస్తానన్నారు. ముఖ్యమంత్రి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఆశీస్సులు కూడా తనకు కావాలన్నారు.

భారీ మెజార్టీతో గెలిపిస్తాం - ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మమబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌ను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. ఇందుకోసమే లౌకిక శక్తుల పునరేకీకరణ కోసం సర్వం ఒడ్డుతామన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం కుటుంబాలకు కూడా సమయం ఇవ్వకుండా తాను, వంశీ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నామన్నారు. గతంలో పాలమూరు నుంచి గెలుపొందిన ఎంపీలు పార్లమెంట్‌లో ప్రజల సమస్యల గురించి గొంతెత్తలేదని, వంశీచంద్‌ మా త్రం పార్లమెంట్‌లో పాలమూ రు ప్రజాగొంతుకను వినిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని వీర్లపల్లి శంకర్‌ కోరారు. ఈ సమావేశంలో సీనియర్‌ నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, బాబర్‌ఖాన్‌, రఘు, చెన్నయ్య, తిరుపతిరెడ్డి, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జంగా నరసింహా, రాజు, వీరేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అనంత పద్మనాభుడి ఆశీస్సులతో విజయం సాధిస్తా

కొత్తూర్‌/కేశంపేట : పెంజర్ల శ్రీఅనంతపద్మనాభస్వామి ఆశ్శీస్సులతో పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తానని వంశీచంద్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెంజర్ల అనంతపద్మనాభస్వామి ఆలయంలో అదివారం వంశీచంద్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపద్మనాభస్వామిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందన్నారు. ధర్మకర్తల మండలి చైౖర్మన్‌ బెజవాడ అనితారెడ్డి వంశీని శాలువాతో సన్మానించారు. మాజీ జడ్పీటీసీ శ్యాసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ అంజమ్మ, మండలాధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, నాయకులు అంబటి ప్రభాకర్‌, రవికుమార్‌గుప్త, సిద్దార్థరెడ్డి, వస్పుల మహేందర్‌, దయానంద్‌గుప్త, నవీన్‌చారి, ఎర్రొళ్ల జగన్‌, లింగారం సురే్‌షగౌడ్‌, పాముల రమేష్‌, రాందా్‌సనాయక్‌, రమేష్‌, సుధాకర్‌, చింతసాయితేజశ్వర్‌, రాజు, తదితరులున్నారు. అదేవిధంగా కేశంపేట మండలం బైర్కాన్‌పల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోస్టర్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో వీర్లపల్లి శంకర్‌, వంశీచంద్‌రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రూప్లానాయక్‌, యాదగిరిచారి, వై.గిరిధర్‌, అంజయ్య, రాఘవేందర్‌రావు, కుమార్‌, గణేష్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వంశీని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

ఆమనగల్లు : ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే చల్లా చల్లా వంశీచంద్‌రెడ్డిని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల కాంగ్రెస్‌ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యనాయక్‌, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, మాజీ జడ్పీటీసీ శ్రీపాతిశ్రీనివాస్‌ రెడ్డిల ఆధ్వర్యంలో ఆయా మండలాల నాయకులు వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లను షాద్‌నగర్‌లో కలిశారు. మహబూబ్‌ నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు అజీం, రవీందర్‌, బాల్‌రాజ్‌, రామలక్ష్మణ్‌, హీరా సింగ్‌, జవహార్‌లాల్‌, మల్లేశ్‌గౌడ్‌, రాంచందర్‌నాయక్‌ తదితరులు వంశీని కలిశారు.

Updated Date - Mar 11 , 2024 | 12:17 AM