Share News

సెల్‌ఫోన్‌ పోతే సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:47 PM

ఎవరైనా సెల్‌ఫోన్‌ పోతే సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ ఆనంద్‌ అన్నారు. బుధవారం సుల్తాన్‌ పూర్‌, నాగ్వారం గ్రామాలకు చెందిన వారికి పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు రికవరీ చేసి అందజేశారు.

సెల్‌ఫోన్‌ పోతే సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయాలి

బంట్వారం, ఫిబ్రవరి 7 : ఎవరైనా సెల్‌ఫోన్‌ పోతే సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ ఆనంద్‌ అన్నారు. బుధవారం సుల్తాన్‌ పూర్‌, నాగ్వారం గ్రామాలకు చెందిన వారికి పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు రికవరీ చేసి అందజేశారు. మొబైల్‌ ఫోన్‌ పోయినా, లేదా చోరీకి గురైనా వెంటనే స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో లేదా సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో నమోదు చేయాలని తెలిపారు. మొబైల్‌ ఎక్కడుంతో ట్రాక్‌ చేసి రికవరీ చేస్తామన్నారు. ఫిర్యాదులో ఫోన్‌ ఐఎంఈఐ నంబరు, ఆధార్‌ కార్డు, మీ సేవ ఆన్లైన్‌ సెంటర్లో కట్టిన రిసిప్ట్‌ జత చేయాలని వివరించారు.

Updated Date - Feb 07 , 2024 | 11:47 PM