ధ్యానంతో ఆరోగ్యం
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:39 PM
ధ్యానం అహాన్ని దూరం చేస్తుందని.. నిగ్రహ శక్తి, ఆత్మజ్ఞానం, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని బోధన్ ఎమ్యెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రపంచానికి ధ్యానం, యోగాను పరిచయం చేసిన ఘనత భారతీయులకే దక్కుతుందన్నారు.

బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
కడ్తాల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ధ్యానం అహాన్ని దూరం చేస్తుందని.. నిగ్రహ శక్తి, ఆత్మజ్ఞానం, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని బోధన్ ఎమ్యెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రపంచానికి ధ్యానం, యోగాను పరిచయం చేసిన ఘనత భారతీయులకే దక్కుతుందన్నారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు-3 అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శనివారం పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్ రెడ్డి, పత్రీజీ కూతురు పరిణతి పత్రిజీ, సీజీఆర్ చైర్మన్ లీలాలక్ష్మారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే పిరమిడ్‌ను సందర్శించి కొద్దిసేపు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ధ్యాన, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు లక్ష్మణ్ రావు, హన్మంత్ రావు, మాధవి, లక్ష్మీ, దామోదర్ రెడ్డి, సాంబశివరావు, బాలకృష్ణ, జయశ్రీ, రాంబాబు, శ్రీరామ్‌గోపాల్, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, ప్రవాస భారతీయుడు డాక్టర్ లట్టుపల్లి రాకేశ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రామకృష్ణ, నర్సింహ్మ, సురేశ్, మాజీ సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.