Share News

ప్రజలతోనే ఉంటా.. వారికోసమే కొట్లాడతా

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:39 AM

తాను ప్రజలతోనే ఉంటానని.. వారికోసమే కొట్లాడతానని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నంతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ చేసిన పనులే తన గెలుపునకు బాటలన్నారు. ప్రస్తుతం దేశంలో మోదీ వేవ్‌ నడుస్తోందని.. నో కరప్షన్‌.. ఓన్లీ డెవల్‌పమెంట్‌ అని చెప్పారు.

ప్రజలతోనే ఉంటా.. వారికోసమే కొట్లాడతా
సాల్విడ్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

మోదీ చేసిన అభివృద్ధే ‘కొండా’ గెలుపునకు బాటలు 8 దేశంలో మోదీ వేవ్‌.. నో కరప్షన్‌.. ఓన్లీ డెవల్‌పమెంట్‌

బీఆర్‌ఎస్‌ వీక్‌.. కాంగ్రె్‌సతోనే పోటీ.. 8 ఆరు గ్యారంటీలు అమలు కల్ల రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం అసాధ్యం

మీడియా సమావేశంలో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 18 : తాను ప్రజలతోనే ఉంటానని.. వారికోసమే కొట్లాడతానని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నంతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ చేసిన పనులే తన గెలుపునకు బాటలన్నారు. ప్రస్తుతం దేశంలో మోదీ వేవ్‌ నడుస్తోందని.. నో కరప్షన్‌.. ఓన్లీ డెవల్‌పమెంట్‌ అని చెప్పారు. బీజేపీ విధానం అంత్యోదయ అని చెప్పారు. కాంగ్రె్‌సది.. చేయి గుర్తు కాదు.. చెంపదెబ్బ గుర్తు అని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం అసాధ్యమని, కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలుకావన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర నిధులు అన్ని పార్టీల సర్పంచ్‌లకు రాజకీయాలకతీతంగా ఇవ్వడం జరిగిందన్నారు. రూ.11 కోట్ల నిధుల్లో 1,094 పనులకు రూ.7 కోట్లపై చిలుకు ఖర్చు చేసినట్లు గుర్తుచేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి కేవలం 49 పనులు మాత్రమే చేపట్టడం జరిగిందని విమర్శించారు. తాను హైవే ప్రస్తావన పార్లమెంట్‌లో మాట్లాడి తేవడం జరిగిందని, కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేసిన అప్పా జంక్షన్‌ టూ మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయడం కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు చేతకాలేదని తెలిపారు. కోట్‌పల్లి ప్రాజెక్ట్‌ అభివృద్ధికి వంద కోట్లు తీసుకువచ్చినట్లు చెప్పారు. తాండూరులో నాపరాతి పరిశ్రమకు జీఎస్టీ 18 నుంచి 5 శాతం వరకు తీసుకు వచ్చినట్లు తెలిపారు. తనను మరోసారి చేవెళ్ల ఎంపీగా గెలిపిస్తే.. వికారాబాద్‌ నుంచి తాండూరు వరకు నాలుగు లేన్ల రోడ్డు, శంకర్‌పల్లి నుంచి వయా మోమిన్‌పేట రోడ్డు, అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు విస్తరణ పనులు పూర్తిచేయిస్తానని చెప్పారు. శంకర్‌పల్లి నుంచి తాండూరు వరకు ఎంఎంటీఎస్‌ రైలు తీసుకురావడంలో బీఆర్‌ఎస్‌ చేతులెత్తేసిందన్నారు. చేవెళ్లలో త్వరలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని,ప్రధాని మోదీ హాజరుకానున్నట్లుచెప్పారు.

బీఆర్‌ఎస్‌ వీక్‌.. కాంగ్రె్‌సతోనే పోటీ..

బీఆర్‌ఎస్‌ చాలా వీకైందని, కాంగ్రె్‌సతోనే తనకు పోటీ అని కొండా అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అకాక్కులు చవాక్కులు వేయడం సరైంది కాదని, బీఆర్‌ఎస్‌ డమ్మీ క్యాండెట్‌ను పెట్టారనటం తప్పు అని, ఆయన పెద్ద మనిషి.. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని తెలిపారు.

‘69’ ఘోరమైన జీవో

ఎన్నికలు వచ్చినప్పుడల్లా జీవో 111పై నేతలు వాగ్దానాలు ఇస్తున్నారని, చేవెళ్ల, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేలు యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌లు ప్రతి ఎన్నికల్లో ఇదే చెబుతున్నారని తెలిపారు. జీవో 111 రద్దు చేసి అంతకన్నా ఘోరమైన 69 జీవో తీసుకువచ్చారని, ఈ జీవో ఉల్టాపల్టాగా ఉందన్నారు.

కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు

కరోనా కాలంలో తాను ఎన్నో సేవలందించినట్లు విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. శానిటైజర్‌ తయారుపై అవగామన కల్పించడం, గ్లౌస్‌, మాస్క్‌లు పంపిణీ చేయడం, చేవెళ్లలో 15 బెడ్లతో ఐసోలేషన్‌ సెంటర్‌, డాక్టర్లకు ప్రత్యేక మాస్క్‌లు, మహావీర్‌ ఆసుత్రిలో 20 నేచురల్‌ వెంటిలేటర్లు తయారు చేసి అందించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా ఇండియన్‌ కొవిడ్‌ వెంటిలేటర్‌ను తాను తయారు చేయడం జరిగిందన్నారు.

బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్‌ నేతలు

శంషాబాద్‌ రూరల్‌/రాజేంద్రనగర్‌ : శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఊట్‌పల్లి, కిషన్‌గూడ, తొండుపల్లికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బంజరాహిల్స్‌లోని ఆయన నివాసంలో బీజేపీలో చేరారు. మైలార్‌ దేవుపల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో వంద మంది బీఆర్‌ఎస్‌ జాగృతి రాజేంద్రనగర్‌ అసెంట్లీ నియోజకవర్గ కన్వీనర్‌ కొండా పరమే్‌షగౌడ్‌, దూదే నర్సింహ, కొడూరి సురేందర్‌, మల్లే్‌షకుమార్‌, రామకృష్ణ సిద్దులుగౌడ్‌తో పాటు మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా కొండా కండువాలు కప్పి ఆహ్వానించారు మల్లారెడ్డి, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి తోకల శ్రీనివా్‌సరెడ్డి, మున్సిపల్‌ అధ్యక్షుడు దేవేందర్‌, భీమార్జున్‌రెడ్డి, కౌన్సిలర్‌ కొండా ప్రవీణ్‌గౌడ్‌, శ్రీని వాస్‌యాదవ్‌ తదితరులున్నారు.

వికారాబాద్‌ : ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని కచ్చితంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగుర వేస్తామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శి రాజేందర్‌ రెడ్డిలు అన్నారు. వికారాబాద్‌లోని గంగారంలోని నాలుగు వార్డుల్లో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ధారూరు: మండలంలోని చింతకుంట, హరిదాసుపల్లి గ్రామాలలో గురువారం చేవేళ్ల పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరపున పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

తాండూరు రూరల్‌: ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, గౌతాపూర్‌ ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి(సాయిరెడ్డి) బీఆర్‌ఎస్‌ పార్టీ రాజీనామా చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలోబీజేపీలో చేరారు.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం

మోమిన్‌పేట్‌, ఏప్రిల్‌ 18: మండలంలోని వెల్చాల్‌, మొరంగపల్లి గ్రామాల్లో గురువారం బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ చేసిన అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కన్వీనర్‌ రఘునాథ్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు మొరంగపల్లి నర్సింహారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, ఎర్ర సత్యం, నర్సింహులు, ఆమ్రాది మహేశ్‌, మందల బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

కులకచర్ల: మండలంలోని సాల్విడ్‌లో గురువారం బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యరెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌమ్యరెడ్డి మాట్లాడుతూ మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ కార్యకర్తలు బీజేపీ గెలుపునకు కృషిచేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిని గెలిపించి పీఎం మోదీకి కానుకగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె మహిపాల్‌, మండల అధ్యక్షుడు సూర్యకాంత్‌, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, మండల ప్రధాన కార్యదర్శులు హనుమంతు, నర్సింహారెడ్డి, యువ మోర్చా మండల అధ్యక్షుడు గడుసు మహిపాల్‌, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు భీమయ్య, మండల కోషాధికారి కె.మహిపాల్‌, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:39 AM