Share News

ఏడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:52 PM

రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన వ్యక్తిని ఘట్‌కేసర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 7: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన వ్యక్తిని ఘట్‌కేసర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, చీకటిమామిడికి చెందిన దీరావత్‌ ప్రశాంత్‌(20) ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో తక్కువ ధరకు రేషన్‌బియ్యం కొనుగోలు చేసి కోళ్లఫారం, ఇటుకబట్టీల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటాడు. కాగా ఎదులాబాద్‌లో శుక్రవారం ఏడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కొనుగోలుచేసి ఓ ఇంట్లో నిల్వచేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిల్వచేసిన ఏడు క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొ దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 08:31 AM