ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:12 AM
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం శంషాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నర్సింహారావు కథనం మేరకు..

శంషాబాద్ రూరల్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం శంషాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నర్సింహారావు కథనం మేరకు.. కొందర్గు మండల కేంద్రానికి చెందిన వడ్డె రాజు(40) మండల పరిధిలోని మదన్‌పల్లి ఒరియంటేన్ గార్డెన్‌లో పని చేస్తున్నాడు. సోమవారం తోటలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్ధలానికి చేరుకున్న వారు పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, అతడి మృతికి గల కారణాలు తెలియలేదని ఎస్సై తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
కడుపునొప్పితో బాధపడుతున్న మహిళ..
మంచాల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ అత్మహత్య చేసుకున్న ఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధి తాళ్లపల్లిగూడలో సోమవారం చోటుచేసుకుంది. యాచారం మండలం చౌదర్‌పల్లికి చెందిన అమీర్‌పేట్ మౌనిక(21)ను రెండు నెలల క్రితం తాళ్లపల్లిగూడకు చెందిన రమే్‌షకు ఇచ్చి వివాహం చేశారు. తాళ్లపల్లిగూడలోని అత్తవారింట్లో ఉదయం ఎవరూ లేని సమయంలో మౌనిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అయితే, ఆమె తరచూ కడుపునొప్పితో బాధపడేదని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లాలయ్య తెలిపారు.