Share News

స్కేటింగ్‌లో గిన్ని్‌సబుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:53 PM

ఆత్కూర్‌ గ్రామానికి చెందిన బాలుడు స్కేటింగ్‌లో గిన్ని్‌సబుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు. పెద్దేముల్‌ మండలం ఆత్కూర్‌ గ్రామానికి చెందిన విక్రమాచారి కుమారుడు రుద్రాంశ్‌చారి నెల్లూరు జిల్లాలో మూడవతరగతి చదువుతున్నాడు.

స్కేటింగ్‌లో గిన్ని్‌సబుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు

సాధించిన ఆత్కూర్‌ కుర్రోడు

పెద్దేముల్‌, జూన్‌ 3 : ఆత్కూర్‌ గ్రామానికి చెందిన బాలుడు స్కేటింగ్‌లో గిన్ని్‌సబుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు. పెద్దేముల్‌ మండలం ఆత్కూర్‌ గ్రామానికి చెందిన విక్రమాచారి కుమారుడు రుద్రాంశ్‌చారి నెల్లూరు జిల్లాలో మూడవతరగతి చదువుతున్నాడు. తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు జిల్లాలో పనిచేస్తుండడంతో ఆయన కుమారుడిని అక్కడే ముత్తుటూరు మండల కేంద్రంలో చదివిస్తున్నారు. శివగంగ రోలర్‌స్కేటింగ్‌ క్లబ్‌ వారు కర్ణాటకలోని బెల్గాంలో మే 26 నుంచి 31 వరకు అటెంప్ట్‌ ఫర్‌ గిన్ని్‌సవరల్డ్‌ రికార్డు పేరున 75 గంటల స్కేటింగ్‌ నిర్వహించారు. అందులో రుద్రాంశ్‌చారి పాల్గొని పతకం సాధించాడు. గిన్సిస్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు. విషయం తెలిసిన గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆబాలుడికి అభినందనలు తెలియజేశారు.

Updated Date - Jun 03 , 2024 | 11:53 PM