Share News

షార్ట్‌సర్క్యూట్‌తో కిరాణ షాపు దగ్ధం!

ABN , Publish Date - May 24 , 2024 | 11:24 PM

మండల పరిధిలోని కొండకల్‌ గ్రామంలో ప్రమాదవశాత్తు కిరాణ దుకాణం కాలి బూడిదైంది. సుమారు రూ. 20లక్షల ఆస్థి నష్టం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

షార్ట్‌సర్క్యూట్‌తో కిరాణ షాపు దగ్ధం!
మంటలు చెలరేగడంతో దగ్ధమవుతున్న కిరాణ షాపు

కాలిబూడిదైన సామగ్రి.. రూ. 20లక్షల మేర ఆస్థి నష్టం

డయల్‌ 100కు కాల్‌చేసినా సకాలంలో రాని ఫైర్‌, పోలీసు సిబ్బంది

శంకర్‌పల్లి, మే 24 : మండల పరిధిలోని కొండకల్‌ గ్రామంలో ప్రమాదవశాత్తు కిరాణ దుకాణం కాలి బూడిదైంది. సుమారు రూ. 20లక్షల ఆస్థి నష్టం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండకల్‌ గ్రామానికి చెందిన కొలను గణపతిరెడ్డి(రాంరెడ్డి కిరాణ అండ్‌ జనరల్‌ స్టోర్‌) కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మా దిరిగానే గురువారం రాత్రి దుకాణం మూసివేసి ఇంట్లో పడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కిరాణ షాపులో మంటలు అంటుకోవడంతో ఆయన పిల్లలు రుత్విక్‌రెడ్డి, కళ్యాణ్‌రెడ్డిలు గమనించి గణపతిరెడ్డిని నిద్రనుంచి లేపారు. వెంటనే గణపతిరెడ్డి చుట్టుపక్కల వారికి సమాచారం అందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచార మివ్వగా పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఎవరూ సకాలంలో రాకపోవడంతో దుకాణం కాలి బూడిదైందని బాధితుడు గణపతిరెడ్డి లబోదిబోమన్నాడు. కాగా, రెండు ఫ్రిడ్జీలు, కూలర్‌, హార్డ్‌ డిస్క్‌, టీవీతో పాటు దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలి బూడిద య్యాయని వాపోయాడు. షాట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. సుమారుగా రూ.20లక్షల ఆస్థి నష్టం జరిగిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. ఈమేరకు మోకిల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 24 , 2024 | 11:25 PM