కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:19 PM
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి తెలిపారు.

ఘట్‌కేసర్ రూరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటీ, ప్రతా్‌పసింగారంలో శుక్రవారం ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,320, కామన్ రకానికిరూ.2,300 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంను దళారులకు విక్రయించి మోసపోవద్దని తెలిపారు. సకాలంలో గన్నీలు, రవాణ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల డీఎం సుగుణబాయి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్‌రెడ్డి, తహసీల్దార్ డీఎస్ రజిని రెడ్యానాయక్, రామిరెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ టౌన్: మేడ్చల్ మున్సిపల్ పూడూరు సహకార సంఘంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధరతో పాటు బోన్‌సగా రూ500 చెల్లిస్తున్నట్లు సొసైటీ చైర్మన్ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం పాలక వర్గం, అధికారులు పాల్గొన్నారు.