Share News

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 21 , 2024 | 12:11 AM

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీసీవో ఈశ్వరయ్య అన్నారు. మండలంలోని మేకవనంపల్లి గ్రామంలో సోమవారం ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
మేకవనంపల్లిలో కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీసీవో ఈశ్వరయ్య

మోమిన్‌పేట్‌, మే 20: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీసీవో ఈశ్వరయ్య అన్నారు. మండలంలోని మేకవనంపల్లి గ్రామంలో సోమవారం ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే రైసుమిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాల కారణంగా తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్‌చేసేందుకు అవసర మైన లారీలను కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు తొమ్మిది లారీల వరిధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా ఆరు లారీల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. జొన్నలను కొనుగోలు చేయడంలో అలసత్వం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో మేకవనంపల్లి సొసైటీ సీఈవో బాలకృష్ణ, మోమిన్‌పేట్‌ సొసైటీ శేఖర్‌, సిబ్బంది సురేందర్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 12:11 AM