Share News

అరాచక శక్తులను ప్రభుత్వం ఊపేక్షించదు : ఎంపీ

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:13 AM

ఆరాచకాలు హింసను కాంగ్రె్‌స ప్రభుత్వం ఊపేక్షించబోదని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు. మండల కేంద్రం సమీపంలోని బట్టర్‌ఫ్లై సిటీలో ఈనెల 5న హత్యకు గురైన గోవిందాయపల్లికి చెందిన గుండెమోనిగారి శివగౌడ్‌. శేషగారి శివగౌడ్‌ కుటుంబాలను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ పరామర్శించారు.

అరాచక శక్తులను ప్రభుత్వం ఊపేక్షించదు : ఎంపీ
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల, జూన్‌ 11 : ఆరాచకాలు హింసను కాంగ్రె్‌స ప్రభుత్వం ఊపేక్షించబోదని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు. మండల కేంద్రం సమీపంలోని బట్టర్‌ఫ్లై సిటీలో ఈనెల 5న హత్యకు గురైన గోవిందాయపల్లికి చెందిన గుండెమోనిగారి శివగౌడ్‌. శేషగారి శివగౌడ్‌ కుటుంబాలను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ పరామర్శించారు. జరిగిన ఘటనలపై బాధిత కుటుంబాలను, పోలీస్‌ అధికారులను అడిగితెలుసుకున్నారు. ఇద్దరు యువకులను హతమార్చడం బాధాకరమన్నారు. విచారణ జరిపి శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తో తాను మాట్లాడతానన్నారు. మల్లు రవి, ఎమ్మెల్యే నారాయణరెడ్డిలు ఆర్థికసాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.10వేల మేర ఎమ్మెల్యే నారాయణరెడ్డి సాయమందించారు. పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివా్‌సరెడ్డి, యాట నర్సింహ, రవికాంత్‌గౌడ్‌, వస్పుల జంగయ్య, బిక్యానాయక్‌, తదితరులున్నారు. ఇద్దరిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. గోవిందాయిపల్లిలో బాధిత కుటుంబ సభ్యులను దశరథ్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రాధాకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా దశరథ్‌ నాయక్‌ ఆర్థిక సాయం అందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌ గ్రేషియా అందించాలని దశరథ్‌ కోరారు. కడ్తాల వైస్‌ ఎంపీపీ ఆనంద్‌ మృతుల కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు.

Updated Date - Jun 12 , 2024 | 12:13 AM