Share News

ఆలయాలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:49 PM

రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి చింతల వెంకన్న డిమాండ్‌ చేశారు.

ఆలయాలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

మహేశ్వరం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత సహకార్యదర్శి చింతల వెంకన్న డిమాండ్‌ చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో తుక్కుగూడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించలేదన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు కక్కుర్తి పడి ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు చేస్తున్న టెర్రరిస్టులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరం గా విఫలమైందని, ఆలయాలపై దాడులను ఆపకపోతే హిందువుల సత్తా చాటుతామన్నారు. రాఘవేందర్‌, రాజు, ఈశ్వర్‌, వినోద్‌, రామ్‌రెడ్డి, అనీల్‌, మహేష్‌, శ్రీరామ్‌, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:49 PM