Share News

కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:06 AM

ప్రజా చైతన్య కార్యక్రమాలలో కవులు, కళాకారులు, గాయకుల పాత్ర కీలకమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు

కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
వెన్నెలను సన్మానిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు , నవంబరు 24 (ఆంధ్రజ్యోతి ): ప్రజా చైతన్య కార్యక్రమాలలో కవులు, కళాకారులు, గాయకుల పాత్ర కీలకమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమితులైన ప్రజా యుద్దనౌక గద్దర్‌ కూతురు వెన్నెలకు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్వకుర్తి పట్టణంలో గద్దర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్న వెన్నెలను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు బాలాజీసింగ్‌తో కలిసి కసిరెడ్డి సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కవులు, కళాకారులు, రచయితలు, సాహితివేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో లక్ష్మణశర్మ, బృంగి ఆనంద్‌ కుమార్‌, సంజీవ్‌కుమార్‌, యాదయ్య, ఆంజనేయులు, రాములు, సంజీవ, లింగంగౌడ్‌, విజయ్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌రాథోడ్‌, బాబా, మల్లయ్య, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:06 AM