Share News

స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:49 PM

స్థానిక సంస్థలను బలోపేతం చేసి గ్రామీణ ప్రజాప్రతినిధుల గౌర వాన్ని పెంచేలా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ
గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సర్పంచ్‌లు

తలకొండపల్లి, జనవరి 17: స్థానిక సంస్థలను బలోపేతం చేసి గ్రామీణ ప్రజాప్రతినిధుల గౌర వాన్ని పెంచేలా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో గ్రామాల్లో చేసిన అబివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచ్‌లు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆయన విచారం వ్యక్తం చే శారు. గౌరిపల్లిలో ఈజీఎస్‌ నిధులు రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే, సర్పంచ్‌ అనురాధనరేందర్‌గౌడ్‌,ఎంపీటీసీ సరిత గణేశ్‌లతో ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మొక్కలు నాటారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగి ఇబ్బందులు తొలుగుతాయన్నారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించి ఇబ్బందులు తీరుస్తామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్‌లను, వారి బాధలను పట్టించుకోని బీఆర్‌ఎస్‌ నేతలు... ఇప్పుడు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడుతామంటూ రాజకీయ డ్రామాలకు తెరలేపారన్నారు. అధికారం కోల్పోవడా న్ని బీఆర్‌ఎస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నార న్నారు. భవనాలు లేని అన్ని పంచాయతీలకు త్వర లోనే భవనాల నిర్మాణం చేపడుతామని కసిరెడ్డి పే ర్కొన్నారు. వివక్షకు తావులేకుండా కాంగ్రెస్‌ పథకా లను, పాలనను అందిస్తుందని చెప్పారు. ప్రజల ఆశయాలకనుగుణంగా ఇందిరమ్మ పాలన కొనసాగుతు ందన్నారు. పేదలందరికీ ప్రభుత్వం ప్రకటించిన విధ ంగా ఆరు గ్యారంటీలను అందజేస్తామన్నారు. తలకొ ండపల్లి మండలాన్ని అన్నింటా అభివృద్ధి పరచి ఆదర్శంగా నిలుపుతామన్నారు. గ్రామస్థుల కోరిక మేరకు మహిళా సంఘం భవన నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. గ్రా మంలో రేషన్‌ దుకాణం ఏర్పాటు, బస్సు సౌకర్యం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేయాలని స్థానికులు కసిరెడ్డిని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్‌, ఎంపీవో రఘు, డీఈఈ శ్రీనివాస్‌, ఏఈ విద్యాసాగర్‌, పంచాయతీ కార్యదర్శి నర్సింహ, ఎంపీటీసీలు రమే శ్‌, సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు బొజ్జ వెంకట్రామ్‌రెడ్డి, నాగమణిలింగంగౌడ్‌, రఘుపతి, శ్రీశైలం, రమేశ్‌యా దవ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నా యకులు లక్ష్మీదేవిరఘురాములు, భగవాన్‌రెడ్డి, యా దయ్యగౌడ్‌, డేవిడ్‌, రేణురెడ్డి, శంకర్‌, యాదయ్య, రా ములు, శేఖర్‌, పవన్‌, భరత్‌, ఆరిఫ్‌, కృష్ణ, వెంకట్‌ రెడ్డి, యాదగిరి, అజీం, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:49 PM