Share News

నిధుల గోల్‌మాల్‌ కేసు.. బిల్‌కలెక్టర్‌ హేమంత్‌కుమార్‌ రిమాండ్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:29 AM

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో నిధులు గోల్‌మాల్‌కు పాల్పడిన బిల్‌కలెక్టర్‌ను ఘట్‌కేసర్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.

నిధుల గోల్‌మాల్‌ కేసు.. బిల్‌కలెక్టర్‌ హేమంత్‌కుమార్‌ రిమాండ్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 11: ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో నిధులు గోల్‌మాల్‌కు పాల్పడిన బిల్‌కలెక్టర్‌ను ఘట్‌కేసర్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి హేమంత్‌కుమార్‌ ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో బిల్‌కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు ట్రేడ్‌ లైసెన్స్‌, ఇంటి బకాయిలు వసూలుచేసి బ్యాంక్‌ఖాతాలో జమచేయాలి. కానీ హేమంత్‌కుమార్‌ 2021 నుంచి 2023 వరకు వసూలు చేసిన ఇంటి బకాయిలు, ట్రేడ్‌ లైసెన్స్‌ డబ్బులు మున్సిపాలిటీ బ్యాంక్‌ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నాడు. ఆగస్టు 2023లో మున్సిపాలిటీకి సంబంధించిన ఆడిట్‌ జరపగా దాదాపు రూ.3కోట్ల నిధులు బ్యాంక్‌ ఖాతాలో జమ కాలేదని తేలింది. దీంతో మున్సిపల్‌ అధికారుల ఆదేశాల మేరకు హేమంత్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. మున్సిపల్‌ కమిషనర్‌ సాబేర్‌ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు నిధుల దుర్వినియోగంపై హేమంత్‌ను అదుపులోకి తీసుకోని మంగళవారం సాయంత్రం రిమాండ్‌ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 08:14 AM