మహిళ బ్యాగులో నుంచి బంగారం అపహరణ
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:36 AM
ఇంట్లో నిర్వహించే మనుమరాలి ఫంక్షన్ సందర్భంగా తులం బంగారం పెడుదామని అనుకుంది ఆ మహిళ. కానీ ఇంతలో బ్యాగులో ఉన్న బంగారం అపహరణకు గురవ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. బాధితురాలి కథనం ప్రకారం..

షాద్‌నగర్ రూరల్, జూన్ 16: ఇంట్లో నిర్వహించే మనుమరాలి ఫంక్షన్ సందర్భంగా తులం బంగారం పెడుదామని అనుకుంది ఆ మహిళ. కానీ ఇంతలో బ్యాగులో ఉన్న బంగారం అపహరణకు గురవ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన భారతమ్మ ఆదివారం షాద్‌నగర్‌లో జరిగే మనుమరాలు ఫంక్షన్‌కు వచ్చింది, లేడీస్ కార్నర్ అనే షాపులో కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. ఇంతలో ఆమెను అనుసరిస్తూ షాప్‌లోకి వచ్చిన ఇద్దరు మహిళలు ఆమె బ్యాగులోని నుంచి తులం బంగారాన్ని అపహరించుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆమె బ్యాగును పరిశీలించగా అందులో బంగారం కనిపించలేదు. అయితే, షాపులోని సీసీ కెమెరాల్లో బంగారం అపహరించిన అనుమానిత మహిళల దృశ్యాలు నమోదయ్యాయి.