Share News

చందన్‌వెళ్లి భూ నిర్వాసితులకు న్యాయం చేయండి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:10 AM

చందన్‌వెళ్లిలోని సర్వేనెంబర్‌ 190లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై రైతులకు న్యాయం చేయాలని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి నగరంలో ఆయన నివాసంలో చేవెళ్ల స్వామి ఆధ్వర్యంలో భూనిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.

చందన్‌వెళ్లి భూ నిర్వాసితులకు న్యాయం చేయండి

షాబాద్‌, మార్చి 26 : చందన్‌వెళ్లిలోని సర్వేనెంబర్‌ 190లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై రైతులకు న్యాయం చేయాలని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి నగరంలో ఆయన నివాసంలో చేవెళ్ల స్వామి ఆధ్వర్యంలో భూనిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ధర్నాలు చేశామని, అయినా న్యాయం జరగలేదన్నారు. నష్టపోయిన రైతులను గుర్తించి వెంటనే పరిహారం అందించాలని పేర్కొన్నారు. భూసేకరణ జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్లాట్లు ఇస్తామని చెప్పి అవికూడా ఇవ్వలేదని వాపోయారు. స్పందించిన రేవంత్‌రెడ్డి విచారణ చేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలి

కందుకూరు/చేవెళ్ల : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటాలని, హస్తం అభ్యర్థుల గెలుపునకు ప్రతీ కార్యకర్త, నాయకులు సమష్టిగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డిని ప్రకటించడంతో మంగళవారం మహేశ్వరం నియోజకవర్గస్థాయి నాయకులతో పాటు కందుకూరు మండల కాంగ్రెస్‌ నేతలు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి సమక్షంలో నగరంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల రంజిత్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి మండల నాయకులు ముంగి జైపాల్‌రెడ్డి, ఎస్‌.కృష్ణానాయక్‌, సరికొండ మల్లేష్‌, బొక్క భూపాల్‌రెడ్డి, ఎండి అఫ్జల్‌బేగ్‌, నర్సింహాచారి, కె.రాణాప్రతా్‌పరెడ్డి, సరికొండ జగన్‌, బుక్క పాండురంగారెడ్డి, ప్రభాకర్‌, గణే్‌షనాయక్‌, తదితరులున్నారు.

రంజిత్‌రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించండి

చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రాజేంద్రనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో రంజిత్‌రెడ్డిని అత్యధిక మోజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. నియోజక వర్గ ఇన్‌చార్జి బొర్ర జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ ఆధ్వర్యంలో నేతలంతా సమావేశంలో పాల్గొన్నారు. జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ సీఎం మాటకు కట్టుబడి ఉన్నామని, లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ స్థానం కైవసం చేసుకుంటుందన్నారు. మండలాధ్యక్షుడు గడ్డం శేఖర్‌యాదవ్‌ను సీఎం ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శంషాబాద్‌ మండలంలో భారీ మోజార్టీ ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. సీఎం మాట నిలబెడతామని శేఖర్‌యాదవ్‌ అన్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:10 AM