Share News

గ్రామ సమస్యలపై గరం గరం

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:04 AM

మూడు నెలలకొకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో గ్రామ సమస్యలపై మొరపెట్టుకోవడమే తప్పా పరిష్కారం లభించడంలేదని వివిధ శాఖల అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వెళ్లగక్కారు.

గ్రామ సమస్యలపై గరం గరం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

  • సమావేశానికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయండి

  • ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి

బషీరాబాద్‌, జనవరి 8: మూడు నెలలకొకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో గ్రామ సమస్యలపై మొరపెట్టుకోవడమే తప్పా పరిష్కారం లభించడంలేదని వివిధ శాఖల అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వెళ్లగక్కారు. ఎంపీపీ కరుణఅజయ్‌ప్రసాద్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యుత్‌ అంశంపై చర్చకు రాగా సభ్యులు ఒక్కసారిగా పైకిలేచి ఏఈతో కరెంట్‌ సమస్యలపై ఏకరువు పెట్టారు. ఇళ్లు, పాఠశాలపై కరెంట్‌ తీగాలు వెలాడుతున్నాయని మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని సర్పంచులు రథోడ్‌ సునీత, దశరఽథ్‌, గోళ్లభీమప్ప, శీధర్‌ తదితరులు ఏఈపై మండిపడ్డారు. అదేవిధంగా ఏఏన్‌ఎం, ఆశావర్కర్లు అందుబాటులో ఉండడంలేదని, మాసన్‌పల్లి సర్పంచ్‌ గోళ్లభీమప్ప సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు సక్రమంగా ఉండటంలేదని ఆయా గ్రామాల సర్పంచులు సూర్య, పద్మచందర్‌ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ అంశంపై చర్చకు రాగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సమావేశానికి గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే ఆరాతీశారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఎంపీడీవో రమే్‌షను ఆదేశించారు. అదేవిధంగా పర్ష్యానాయక్‌ తండా సర్పంచ్‌ తమ గ్రామంలో బీటిరోడ్డు వేయాలని కోరారు. కొర్విచెడ్‌ సర్పంచ్‌ శోభారాణి పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఇంకా బేస్‌మెంట్‌ వద్దే పనులు నిలిచిపోయాయని తెలిపారు. కొత్లాపూర్‌లో 300ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ, రెవెన్యూ శాఖల్లో ఎవరి ఆధీనంలోఓ ఉందో తేల్చాలని జడ్పీటీసీ మిర్యాణం శ్రీనివా్‌సరెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణఅజయ్‌ప్రసాద్‌, జడ్పీటీసీ మిర్యాణం శ్రీనివా్‌సరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ శాంతాబాయిరామునాయక్‌, వైస్‌ఎంపీపీ జడల అన్నపూర్ణ, తహసీల్దార్‌ ఎన్‌.వెంకటస్వామి, ఎంపీడీవో రమేష్‌, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

బషీరాబాద్‌ రూపురేఖలు మారుస్తా: ఎమ్మెల్యే

సీఎం సాయంతో బషీరాబాద్‌ మండల రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బషీరాబాద్‌ సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఎప్పటికప్పుడూ గ్రామాలను సందర్శిస్తూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రతీ గ్రామంలో తిరిగానని, ప్రజలసమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్నందున పరిష్కారానికి ప్రత్యేక దృష్టిపెడతానన్నారు. రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

గత ప్రభుత్వం జారీ చేసిన జివోలు చిత్తుకాగితాలు

తాండూరు: గత ప్రభుత్వంలో జారీ చేసిన జివో లన్నీ చిత్తు కాగితాలేనని నిధులు లేకుండా జీవోలు జారీ చేశారని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. తాండూరు క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పనులకు సంబంధించి రూ.500 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రజాపాలనలో అధికారులు పనితీరు భేషుగ్గా ఉందన్నారు. ప్రజాపాలనలో 73,918 దరఖాస్తులు వచ్చాయని అందులో 23000 డేటా ఎంట్రీ పూర్తి చేసినట్లు తెలిపారు. తాండూరుకు రెండు రోజుల్లో మరో ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని బీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఉంటుందని మనోహర్‌రెడ్డి జోస్యం చెప్పారు. తాండూరులో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి రూ.33కోట్ల నిధులు అవసరమవుతాయని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామన్నారు. మన్నెగూడ నుంచి తాండూరు వరకు ఫోర్‌లైన్‌ రోడ్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తాండూరులో బైపాస్‌ రోడ్డుపనులకు ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు రవిగౌడ్‌, సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌, నీరజ బాల్‌రెడ్డి, బోయ రవిరాజ్‌, పెద్దేముల్‌ వైస్‌ ఎంపీపీ మధులత తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:04 AM