Share News

నాలుగున్నర క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:16 AM

అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను పెట్రోలింగ్‌ పోలీసులు పట్టుకున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ కథనం మేరకు..

నాలుగున్నర క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

కొందుర్గు, ఫిబ్రవరి 14: అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను పెట్రోలింగ్‌ పోలీసులు పట్టుకున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ కథనం మేరకు.. మండల పరిధిలోని విశ్వనాథ్‌పూర్‌లో బుధవారం ఉదయం ఓ మారుతి వ్యాన్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో గ్రామానికి పెట్రోలింగ్‌ కోసం వెళ్లిన కానిస్టేబుళ్లు శ్రీధర్‌రెడ్డి, శివకుమార్‌లు వ్యాన్‌ను వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్‌ బి.రాజ్‌కుమార్‌ను విచారించగా ప్రజల నుంచి రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి ఎక్కువ ధరకు కోళ్లఫాం యజమానులకు విక్రయిస్తున్నట్లు చెప్పాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 12:16 AM