‘సోలార్’తో పశుగ్రాసం కటింగ్ మిషన్
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:11 AM
చదివేది ఎనిమిదో తరగతే కానీ.. నవకల్పన చేశాడో విద్యార్థి. సోలార్‌తో పశుగ్రాసాన్ని కోసే పరికరరాన్ని కనుగొని అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రశంసలందుకున్నాడు. మండలంలోని కుర్మిద్ద ఉన్నత పాఠశాలకు చెందిన బైకని సాయిచరణ్ 8వ తరగతి చదువుతున్నాడు. పెట్రోల్, డీజిల్ సాయంతో నడిచే పరికరాలను పశుగ్రాసం కోసం ఉపయోగించడాన్ని చూసి అవేమీ లేకుం డా నడిచే యంత్రాన్ని స్వతహాగా తయారు చేయాలని సాయిచరణ్ నిశ్చయించుకున్నాడు.

పరికరాన్ని కనిపెట్టిన ఎనిమిదో తరగతి విద్యార్థి
యాచారం, జనవరి 11 : చదివేది ఎనిమిదో తరగతే కానీ.. నవకల్పన చేశాడో విద్యార్థి. సోలార్‌తో పశుగ్రాసాన్ని కోసే పరికరరాన్ని కనుగొని అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రశంసలందుకున్నాడు. మండలంలోని కుర్మిద్ద ఉన్నత పాఠశాలకు చెందిన బైకని సాయిచరణ్ 8వ తరగతి చదువుతున్నాడు. పెట్రోల్, డీజిల్ సాయంతో నడిచే పరికరాలను పశుగ్రాసం కోసం ఉపయోగించడాన్ని చూసి అవేమీ లేకుం డా నడిచే యంత్రాన్ని స్వతహాగా తయారు చేయాలని సాయిచరణ్ నిశ్చయించుకున్నాడు. సోలార్‌పవర్ విధానంతో తన పంట పొలంలో మొదట ప్రయోగం చేశాడు. అది విజయవంతం కావడంతో ఇటీవల జరిగిన సైన్స్‌ఫేర్‌లో సోలార్‌తో పశుగ్రాసం కోసే పరికరాన్ని ప్రయోగించి చూపడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. కొత్త ఆలోచనలతో సరికొత్త పరికరాన్ని కనుగొన్న సాయిచరణ్‌ను డీఈవో సుశీందర్‌రావు అభినందించారు. గురువారం కుర్మిద్ద ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్తుపాండురంగారెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. పెట్రోల్, డీజిల్ వాడకంతో వాతావరణ పాడవుతుందని భావించి ఈ పరికరాన్ని కనుక్కున్నట్లు సాయిచరణ్ చెప్పారు.