Share News

షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులు దగ్ధం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:06 AM

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమైన సంఘటన సోమవారం చేవెళ్లలోని భగత్‌సింగ్‌ కాలనీలో చోటుచేసుకుంది.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులు దగ్ధం
ఇంట్లో కాలిపోయిన సామగ్రి

చేవెళ్ల, ఫిబ్రవరి 12 : విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమైన సంఘటన సోమవారం చేవెళ్లలోని భగత్‌సింగ్‌ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సన్నాయి రాధిక కుటుంబీకులు పట్టణంలో ని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారింట్లో షార్ట్‌సర్క్యూట్‌తో సామాన్లు కాలిపోయాయి. ప్రమాద స మయంలో ఇంట్లో ఎవరూ లేరు. స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇ వ్వడంతో అధికారులు చేరుకొని మంటలార్పారు. అగ్ని ప్రమాదంతో పేద కుటుంబం రోడ్డున పడడంతో దాతలు చేయూతనిచ్చారు. మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌రెడ్డి రూ.20వేలు, ఆలయ అర్చకులు శ్రీకాంత్‌చారి, శ్రీపాద్‌ రూ.10వేల సాయం అందించారు. మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్‌ రూ.5వేల సాయం చేసి భాదితులను ఓదార్చారు.

Updated Date - Feb 13 , 2024 | 12:06 AM